జూ.ఎన్టీఆర్ సినిమా ‘‘దేవర” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న విడుదల చేయాలని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ సహకారం అందిస్తున్నారు. వచ్చే నెల 27న వరల్డ్ వైడ్గా దేవర సినిమా రిలీజ్ కానుంది.


 
							 
							