Home Page SliderTelangana

ఆగస్ట్‌లో అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాల్లోని పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుండి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది.