మల్కాజిగిరి ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో నిరూపించారు
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ఆయన మాట్లాడుతూ “మల్కాజిగిరి ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికలలో ఓట్లు వేశారని ఈ పార్లమెంట్ ఎన్నికలలో నిరూపించారు. ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది. భారతదేశం మొత్తంలో ఓట్లు భారీగా పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ విజయం బీజేపీ కార్యకర్తలకే అంకితం. ఈ విజయాన్ని చూసి గర్వపడడం లేదు. ప్రజలకు ఎక్కడ లాభం జరుగుతుందో అది కేంద్రం నుండి, రాష్ట్రం నుండి సాధించి తీరుతాను. ఈ ప్రొటోకాల్స్ ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధించే దిశగా ప్రచారాలు చేయాలి. జిల్లా పరిషత్, పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికలు అన్నింటిలో విజయం సాధించినప్పుడే పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుంది. అందుకే ప్రతీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ప్రతీ నాయకుడు వేరు వేరు గ్రూపులు ఏర్పాటు చేయవద్దు. కేవలం మనందరం బీజేపీ పార్టీకి చెందిన వాళ్లం మాత్రమే. మనందరికీ నాయకుడు బీజేపీ పార్టీ మాత్రమే. సమూహంగా, ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే విజయాలు సాధించగలం. ప్రజాగర్భంలో పుట్టిన బీజేపీ పార్టీపై ఇష్టాన్ని గెలుపు తీరానికి తీర్చవలసిన బాధ్యత ప్రతీ కార్యకర్త మీదా ఉంది”. అని పేర్కొన్నారు.

