Home Page SliderTelangana

తండ్రీ కూతుర్ల బంధంపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్‌పై చర్యలు

తండ్రీ కూతుర్ల బంధంపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యింది తెలంగాణ ప్రభుత్వం. స్నేహితులతో చాటింగ్ చేస్తూ తండ్రీ కూతుర్ల బంధంపై వావివరుసలు మరిచి అసభ్యంగా మాట్లాడిన అమెరికాలో ఉంటున్న యూట్యూబర్ ప్రవీణ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. దీనిపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, వారిలో ఈ మాటలు మాట్లాడిన ప్రవీణ్ అమెరికాలో ఉంటున్నట్లు నిర్థారించారు. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ సినీనటుడు సాయిధరమ్‌తేజ్ ఎక్స్ వేదికగా స్పందించారు.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులను ట్యాగ్ చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పిల్లల వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయవద్దంటూ నెటిజన్లకు సూచించారు. ఈ విషయంపై అనేక మంది మండిపడుతుండడంతో, దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క కూడా మండిపడ్డారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.