ప్రతిరోజు ఉసిరి కాయ తింటే ఎన్ని ప్రయోజనాలో
ఉసిరి కాయ రుచికి కొంచెం పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సీ, యాంటీ ఉన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

