BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..
టిజి: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న జెడ్పి సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేయగా.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ సెక్షన్ 221, 126(2) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి నిలిచారు. అలాగే చట్టం అమల్లోకి వచ్చిన రెండోరోజే కేసు నమోదైనట్లు రికార్డుల్లోకి ఎక్కారు.

