జీవన్ రెడ్డి ఇంటికి బుజ్జగింపులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
4 దశాబ్దాలుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ కోసం పనిచేశానని పేర్కొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కానీ ఏ రకమైన సమాచారం లేకుండా తనపై మూడుసార్లు పోటీచేసి ప్రత్యర్థిగా నిలిచిన సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తగదని మండిపడ్డారు. దీనితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. తాను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు జీవన్ రెడ్డి. నాడు భట్టి విక్రమార్క ప్రతిపక్ష హోదాలో ఉంటే, కేసీఆర్‌తో పాటు పోచారం కూడా కుట్ర చేసి ఆయనను ప్రతిపక్ష నాయకునిగా తొలగించారని పేర్కొన్నారు.