Andhra PradeshHome Page Slider

ఏపీలో 65లక్షలమందికి రూ.7000 పెన్షన్ ఎప్పుడంటే..?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి పెరిగిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయించింది. కాగా  రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులుకు ప్రతినెలా  వచ్చే పెన్షన్ రూ.3000/-నుంచి రూ.4000/- లకు పెంచింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు జూలై 1 న ఒకేసారి రూ.65 లక్షలమంది రూ.7000/- పెన్షన్ అందుకోనున్నారు. కాగా ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4000/- పెన్షన్ వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.