సీఎంగా చంద్రబాబు తొలి ఐదు సంతకాలు వీటిమీదే
నేడు సాయంత్రం 4.41 నిముషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన తొలి ఐదు సంతకాలపై సమాచారం మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారని సమాచారం. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం చేయనున్నారు. ఫించను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచుతూ మూడవ సంతకం, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై ఐదవ సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

