Home Page SliderTelangana

అనర్హత వేటుపై సుప్రీం కోర్టుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్‌

భారత రాష్ట్ర సమితికి తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్‌ తగిలింది. 2022 ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. రాజకీయ ప్రత్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా వ్యవహరించారని కోర్టు ఆక్షేపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థిగా విఠల్‌ను బరిలోకి దింపడంతో అసంతృప్త నేత రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నట్టుగా చిత్రీకరించని విషయాన్ని ఆయన ఆలస్యంగా గుర్తించారు. ఎమ్మెల్సీగా విఠల్‌ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్‌ ఉపసంహరణకు దరఖాస్తు చేశారని ఆరోపిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన హైకోర్టు, విఠల్‌ను ఎమ్మెల్సీ పదవికి అనర్హులుగా ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్న విట్టల్‌పై కోర్టు 50 వేల జరిమానా విధించింది. గతంలో కూడా ఇదే తరహాలో అనర్హత వేటు పడిన కొత్తగూడెం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కూడా స్టే కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.