Andhra PradeshHome Page Slider

చివరి గాజు గ్లాసు ఎవరెవరికి దక్కుతుందో మరి… !?

రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడం కష్టం. కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కలిసొస్తాయ్. కానీ మరికొన్నిసార్లు అనుకోకుండా కొన్ని అంశాలు రాజకీయంగా ఇబ్బందులుపాల్జేస్తాయ్. ఏపీలో జనసేన పార్టీ గాజు సింబల్ అంశం ఇప్పుడు పెనుదుమారానికి కారణమవుతోంది. జనసేన పార్టీ అప్పుడప్పుడూ ఎన్నికల్లో పాల్గొనడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కట్ చేస్తే అసలు విషయం ఏంటంటే.. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఎన్నికలకు గాను, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లను కేటాయించారు. అయితే మిగతా చోట్ల చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును ప్రిఫర్ చేశారు. ఎన్నికల్లో ఆ సింబల్ తమకు వర్కౌటవుతుందని వారు భావించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించింది. మొత్తం వ్యవహారానికి ఈసీ తెరదించింది. జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 11 పార్లమెంట్ సెంగ్మెట్లలో పోటీ చేస్తున్న 77 అసెంబ్లీ సెగ్మెంట్లలో గాజు గ్లాసును ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వబోవడం లేదని ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

మొత్తంగా జనసేన 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల అభ్యర్థులను నియమించడంతో అక్కడ గాజు గ్లాస్ కేవలం జనసేన అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తామంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలో నిలిచింది. విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, రాజంపేట లోక్ సభ స్థానాల్లో కూటమికి గాజు గ్లాస్ గండం తప్పింది. 13 పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుని జనసేనకే ఈసీ ఫ్రీజ్ చేసింది. దీంతో 13 పార్లమెంట్ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ చేజారింది. ఇప్పటికే గాజు గ్లాస్ కేటాయించిన వారికి వేరే గుర్తును కేటాయిస్తారు. ఈ మేరకు సింబల్ కేటాయింపుల్లో మార్పులు చేయాలని ఆర్వోలకు సీఈఓ మీనా ఆదేశించారు. ఇక జనసేన బరిలో నిలవని 12 పార్లమెంట్ సెగ్మెంట్లలోని 84 నియోజకవర్గాల్లో మాత్రమే స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అవకాశం ఉంది. అయితే ఈ స్థానాల్లో ఎవరెవరికి గాజు గ్లాస్ దక్కుతుందో చూడాలి.

జనసేన పోటీ చేస్తున్న 13 పార్లమెంట్ సెగ్మెంట్లలోని 21 అసెంబ్లీ సీట్ల వివరాలు (ఈ ఎంపీ పరిధిలో పలువురికి గ్లాస్ గుర్తు రాదు)

1) విజయనగరం-నెల్లిమర్ల
2) అనకాపల్లి-అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి
3) విశాఖపట్టణం-విశాఖ సౌత్
4) అరకు- పాలకొండ (ఎస్టీ)
5) అమలాపురం- రాజోలు (ఎస్సీ), పి గన్నవరం (ఎస్సీ)
6) కాకినాడ- కాకినాడ రూరల్, పిఠాపురం
7) రాజమండ్రి-రాజానగరం, నిడదవోలు
8) ఏలూరు-ఉంగుటూరు, పోలవరం (ఎస్టీ)
9) నరసాపురం-నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం
10) మచిలీపట్నం-అవనిగడ్డ
11) గుంటూరు-తెనాలి
12) తిరుపతి-తిరుపతి
13) రాజంపేట-రైల్వే కోడూరు (ఎస్సీ)