Andhra PradeshHome Page Slider

రాష్ట్రాన్ని జగన్ నాశనం చేయాలనుకుంటున్నాడు-నారా చంద్రబాబు నాయుడు

ఏపీలో వైసీపీని ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగువారికి ఉందన్నారు. తెలుగు ప్రజల కోసం రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయన్నారు చంద్రబాబు. తమకు ఎలాంటి భేషజాల్లేవన్నారు. కులాలు కూడుపెట్టవన్నారు. పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. వై నాట్ 175 అంటున్నారని.. ఏ పొడిచారని అడుగుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వై నాట్ డీఎస్సీ, ఉచిత ఇసుక ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వైనా 175 కాదు.. వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. హు కిల్లిడ్ బాబాయ్ సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీ కోసం 2029 విజన్ తాము తయారు చేశామన్నారు. అబద్ధాలు పదేపదే చెప్పేవాడు బ్లఫ్ మాస్టర్ అని జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. లేనిది ఉన్నట్టు చెప్తూ ప్రజలను వంచించారన్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక హనుమ విహారి వెళ్లిపోయారన్నారు. కుప్పంలో నీళ్లిచ్చానని సినిమా సెట్టింగ్‌లు వేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 23 గంటల్లో సినిమా సెట్టింగ్‌లు తీశేసారన్నారు. లక్ష ఓట్లు లక్ష్యంగా కుప్పం ఓటర్లకు పిలుపునిచ్చారన్నారు. 2019లో అధికారం కోసం జగన్ పాదయాత్ర చేశాడని… నేను అడ్డుకుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఒక్క అవకాశమని చెప్పి ముద్దులు పెట్టి ప్రజలను చీట్ చేశారన్నారు. బహుబలి సినిమా చూపిస్తాడనుకొని ప్రజలు అపోహపడ్డారని.. నమ్మి ఓటేసినవారు చీకొడుతున్నారన్నారు. వైసీపీ గేమ్‌కు సీక్వెల్ ఉండదన్నారు చంద్రబాబు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ ఉండదన్నారు. వైసీపీ నేతలకు రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామన్నారు చంద్రబాబు.