Home Page SliderTelangana

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న జిల్లా ఎస్పీ

ఎదులాపురం: 24 గంటలూ విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా స్థాయి పోలీసు క్రీడలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసులకు శారీరక దృఢత్వం చాలా ముఖ్యమని, దాన్ని కాపాడుకోవాలంటే క్రీడలతోనే సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.