కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి రేవంత్‌ను ఓడించిన బీజేపీ నేత వెంకట రమణారెడ్డి
కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి సంచలన విజయం నమోదు చేశారు. ఓవైపు సీఎం కేసీఆర్, మరోవైపు పీసీసీ చీఫ్, సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించి సత్తా చాటాడు. 11,600 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
