Home Page SliderNational

అత్యద్భుతంగా ప్రధాని మోదీ “స్టోన్ పెయింటింగ్స్”

చేతిలో కళ ఉంటే ప్రపంచం దృష్టినే ఆకర్షించవచ్చు. కాన్పూర్‌కు చెందిన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని గొప్ప చిత్రాలను ఆవిష్కరించింది. ప్రధాని మోదీ జీవితచరిత్రను కేవలం 11 రోజులలోనే నిగనిగలాడే రాళ్లపై అందమైన చిత్రాలుగా చిత్రించింది. ప్రధాని మోదీ జీవితంలో విశేష ప్రాముఖ్యం ఉన్న ఘట్టాలను చిత్రించింది. వీటిలో అమెరికా అధ్యక్షుడు బైడన్‌ను, ప్రధాని మోదీ  కౌగలించుకున్న చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. వీటితో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు, వ్యాపారవేత్తల చిత్రాలను కూడా ఆమె  గీసింది. హర్షిత పెయింటింగ్స్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టాటా సంస్థల వ్యాపారవేత్త రతన్ టాటా చిత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆమెకు ఇటీవలే రతన్ టాటా నుండి అభినందనలు అందాయి. ఆమె చిత్రాలకు ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దేశవిదేశాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి.