INDIA కూటమి తర్వాత మీటింగ్ ముంబైలోనే
కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల మహా కూటమికి INDIA అని ఈ రోజే నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్’ తర్వాత మీటింగ్ ముంబైలో జరగనుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వచ్చే ఎన్నికలలో గద్దె దింపడమే అజెండాగా ఈ కూటమిలో 26 పార్టీలు కలిసి ఏకాభిప్రాయం తీసుకోనున్నాయి. ఈ పేరు మార్పు ఖరారు అయినట్లే సమాచారం. అయితే చివరి పదమైన అలయెన్స్ అనే పేరు మీదే తర్జనభర్జనలు జరుగుతున్నాయని సమాచారం. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని, ప్రతీ దాన్నీ వారికి కావల్సిన వారికి కట్టబెట్టారని ఈ భేటీలో ఆరోపించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. యువతరం, రైతులు, వ్యాపార వేత్తలు అందరూ ఈ ప్రభుత్వంతో సంతోషంగా లేరని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి, ఒక్క బాటలో నడిచి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన పేర్కొన్నారు.

