ప్రభాస్ “సలార్” మూవీ స్టోరీ లైన్ ఏంటో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతలోనే ప్రభాస్ కొత్త సినిమా “సలార్” నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటంటే సలార్ సినిమా టీజర్ రేపు ఉదయం 5:12 గంటలకు రిలీజ్ కానుందని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సలార్ సినిమా నుంచి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. కాగా IMDB సలార్ స్టోరీ లైన్‌ను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. “ఓ గ్యాంగ్ లీడర్..మరణిస్తున్న స్నేహితుడికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇతర క్రిమినల్ ముఠాలను పట్టుకుంటాడు” అని స్టోరీ లైన్ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు.

