Home Page SliderNational

త్రివిక్రమ్-అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో మరో సినిమా

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ దీనిని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ ,హారిక, హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఈ మేరకు మేకర్స్ దీనిపై ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా త్వరలోనే ఈ త్రివిక్రమ్- అల్లు అర్జున్ క్రేజి కాంబోకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలో వీరిద్దరి కాంబీనేషన్‌లో వచ్చిన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురం సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.