Andhra PradeshHome Page Slider

చంద్రబాబు నాయుడు నివాసం జప్తు

విజయవాడ నగర శివారులోని ఉండవల్లి కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సిఐడి ఈ ఇంటిని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారాల్లో చంద్రబాబుకు లింగంమనేని రమేష్ ఈ ఇంటిని ఇచ్చారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ హయాం నాటి మంత్రి నారాయణ బంధువుల పేరిట ఆస్తులు రమేష్ సమకూర్చారని ఆరోపించింది. ఈ విషయంలో సదరు అక్రమ ఆస్తులు పై అనుమతి ఇవ్వాలని సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. విజయవాడ ఏసిబి కోర్టులో కేసు నడుస్తూండగానే లింగమనేని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఈ కేసు విచారణకు నిరాకరించింది. దీంతో విజయవాడ ఏసిబి కోర్టులోనే సిఐబి పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు లింగమనేని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ పేరిట లింగమనేని ద్వారా సంక్రమించాయని అనబడుతున్న ఆస్తుల జప్తుకు సిఐడికి అనుమతినిచ్చింది. వ్యాపారవేత్త లింగమ నేని రమేష్ కు చెందిన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారు. విజయవాడ నుంచి సచివాలయ ప్రాంతానికి సాధారణంగా కీలకమైన వ్యక్తులు ఇతరులు కృష్ణా నది ఒడ్డున కట్టిన కరకట్ట మీదగా వెళుతుంటారు. ఈ కర కట్టకు పక్కగా వ్యాపారవేత్త లింగమునేని రమేష్ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ కు సంబంధించి పలు వివాదాలు ఉన్నాయి.