అప్సర గత జీవితంలో విస్తుపోయే నిజాలు
సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో విచారణ జరిగే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లి జరిగిందనే విషయం పోలీస్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త తమిళనాడుకు చెందిన కార్తిక్ అనే వ్యక్తి అని, అప్సరను పెళ్లిచేసుకుని ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని, కార్తిక్ తల్లి మీడియాతో చెప్తున్నారు. కార్తిక్ తల్లి ధనలక్ష్మి కథనం ప్రకారం అప్సరకు లగ్జరీగా ఉండాలనే కోరికలు ఎక్కువగా ఉండేవి. ఏవో మానసిక సమస్యలు కూడా ఉండేవని, మందులు వాడుతూ ఉండేదని ఆమె తెలిపింది. ఎప్పుడూ కోరికలతో కార్తిక్‌ను వేధించేదని, అప్సర తల్లి కూడా కార్తిక్‌ను వేధించేవారని, దీనివల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వివరిస్తున్నారు. అప్సర అక్క, ఆమె భర్తపై కూడా ఛీటింగ్ కేసులుండేవని ధనలక్ష్మి తెలిపింది. మరోపక్క చనిపోయిన తమ కుమార్తె అప్సరపై అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. సాయికృష్ణకు తన భార్యతో సఖ్యత లేదని, అందుకే అప్సరను పెళ్లి చేసుకుంటానన్నాడని, ఆరునెలలు గడువడిగాడని అప్సర తండ్రి పేర్కొంటున్నారు. ఏదేమైనా అప్సర హత్యకేసు ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తలపించే మలుపులతో కొనసాగుతోంది.