ఖమ్మంలోని పత్తి మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
ఖమ్మంలోని పత్తి మార్కెట్‌లో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు వెయ్యికి పైగా పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి.ఎండ తీవ్రత కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. అమ్మకం కోసం సిద్దంగా ఉంచిన పత్తి బస్తాలు, గొడౌన్‌లో ఉన్న పత్తిబస్తాలు కూడా మంటలు వ్యాపించినట్లు తెలిసింది. దీనికి దగ్గరలోని మిర్చి బస్తాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీనితో ప్రమాద తీవ్రత పెరిగింది. స్థానికులు, రైతులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఆలస్యంగా రావడంతో ప్రమాద నష్టం ఎక్కువగా జరిగింది. ఖమ్మంలో గత ఐదు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. దీనితో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

