Andhra PradeshHome Page Slider

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఎం జగన్

ఏపీలో అసేంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీలోని ప్రతిపక్షాలు ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చని పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో  షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేశారు. సీఎం మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలలే సమయం ఉందన్నారు. ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదే అని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి మంత్రులంతా ఈ 9 నెలలు కష్టపడండి అని తెలిపారు. మిగిలినది నేను చూసుకుంటానని సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.