తిరుపతి బస్సు బోల్తా 63 మందికి గాయాలు
అన్నమయ్య జిల్లా మదన పల్లెలో బస్సుకు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు కూకుటిమానగడ్డ వద్ద కారును వెనుక నుండి ఢీకొట్టింది. దీనితో బస్సు బోల్తా పడింది. ఈ బస్సులోని 7గుర వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 56 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలయిన వారిని హుటాహుటిన అంబులెన్సులలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా రావడంతో అదుపు తప్పి, బ్రేక్ వేసినా బస్సు ఆగలేదని, దీనితో కారును ఢీకొట్టి బోల్తా పడిందని ప్రాథమిక విచారణలో తెలిసింది.

