Home Page SliderNational

కర్నాటకలో హంగ్ ఛాన్స్ అంటున్న ఎగ్జిట్ పోల్స్

5 సర్వేల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
రెండు సర్వేల్లో బీజేపీ ముందంజ

కర్నాటక హంగ్ అసెంబ్లీ దిశగా వెళ్లే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆరు ఎగ్జిట్ పోల్స్‌లో ఐదు అంచనా వేయగా, వాటిలో మెజారిటీ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యతను ఇచ్చాయి. హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉందన్న అంచనాలను సర్వే ఏజెన్సీలు వ్యక్తం చేశాయి. 224 సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 113 సీట్లు. కేవలం రెండు ఎగ్జిట్ పోల్స్ – టైమ్స్-నౌ ఇటిజి, జీ న్యూస్ మ్యాట్రిజ్ ఏజెన్సీ – కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొ్న్నాయి. మరో రెండు సర్వేలు బీజేపీకి 114 నుంచి 117 వరకు గరిష్టంగా సీట్లు రావొచ్చన్నాయి. ఐతే శనివారం కర్నాటక ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాష్ట్రంలోని అధికార బీజేపీ 114 స్థానాలతో మెజారిటీ మార్కును దాటుతుందని, కాంగ్రెస్ 86 సీట్లు, జేడీ(ఎస్) 21 స్థానాల్లో గెలుస్తుందని న్యూస్ నేషన్-సీజీఎస్ అంచనా వేసింది.

సువర్ణ న్యూస్-జన్ కీ బాత్ కూడా బిజెపికి ఆధిక్యత ఇచ్చింది. 94 -117 సీట్ల మధ్య అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 91-106 సీట్లు, జేడీ(ఎస్)కి 14-24 సీట్లు వస్తాయని తేల్చంది.

మరో ఐదు ఎగ్జిట్ పోల్స్ రేసులో బీజేపీ కంటే కొంచెం ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయన్నాయ్. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోందని పేర్కొన్నాయి.

టైమ్స్ నౌ-ఈటీజీ కాంగ్రెస్ మెజారిటీ మార్కును తాకుతుందని అంచనా వేస్తోంది — ఆ పార్టీ 113 సీట్లు గెలుస్తుందని, బీజేపీకి 85 సీట్లు వస్తాయని తేల్చింది. జనతాదళ్ సెక్యులర్‌కు ఇరవై మూడు సీట్లు వస్తాయని అభిప్రాయపడింది.

224 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీ(ఎస్) 24-32 సీట్లు గెలుచుకుంటాయని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ అంచనా వేసింది.

TV 9-భారత్‌వర్ష్-పోల్ స్ట్రాట్ బీజేపీకి 88-98 సీట్లు, కాంగ్రెస్‌కు 99-109 సీట్లు, జేడీఎస్‌కి 21-26 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

జీ న్యూస్ మ్యాట్రిజ్ బీజేపీకి 79-94 సీట్లు, కాంగ్రెస్‌కు 103-118 సీట్లు, జేడీ(ఎస్)కి 25-33 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఏబీపీ న్యూస్-సీ ఓటర్ బీజేపీ 83-95 సీట్లు, కాంగ్రెస్ 100 నుంచి 112 సీట్లు గెలుస్తాయని అంచనా వేశారు. జేడీ(ఎస్) 21 నుంచి 29 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.