News

శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం..

ఇటీవల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిపై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం ఇంకా మరిచిపోక ముందే.. ఇప్పుడు ఏపీలోని మరో ప్రముఖ క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో గుర్తు తెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకూ దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు. డ్రోన్ ను చూసిన సిబ్బంది దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాలతో పాటు.. మల్లన్న ఆలయం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో స్థానికులు, భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.