మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో ఇటీవల కాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఇవాళ మరోసారి బంగారం,వెండి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.61,640కి చేరింది. అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.56,500గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా రూ.1300 పెరిగి రూ.81,800 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోని ప్రముఖ బ్యాంకులు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది బంగారంపై పెట్టుబడులు పెడుతుండడంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.