రంజాన్ మాసం ప్రారంభం.. రేపటి నుంచి ఉపవాసాలు..
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. ఈ నెల 22వ తేదీ బుధవారం నెలవంక కనిపంచకపోవడంతో ఈనెల 24వ తేదీ శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ప్రత్యేక నమాజు తరావీ గురువారం రాత్రి ప్రారంభంమవడంతోపాటు శుక్రవారం నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. తెల్లవారు జామున 4.50 గంటలకు సహరి పూర్తి చేయాలి.. సాయంత్రం 6.33 గంటల అనంతరం ఉపవాస దీక్షలు విరమించాలి. సౌదీ అరేబియాలో రంజాన్ మాసం ముందే ప్రారంభమవుతుంది. బుధవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో అక్కడ మన దేశం కంటే ఒక రోజు ముందే రంజాన్ మాసం ప్రారంభంకానుంది. గురువారం నుంచే అక్కడ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి.