రేపట్నుంచి అమెజాన్ ప్రైమ్‌లో షారూఖ్ ఖాన్, దీపిక పఠాన్ మూవీ
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం బ్లాక్ బస్టర్ పఠాన్ మూవీ OTT ప్రపంచంలోకి ప్రవేశించేసింది. మీ సీట్‌బెల్ట్‌ను బిగించుకోండి, ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాన్ని సిద్ధంగా ఉండండి, అంటూ అమెజాన్ ప్రైమ్ ప్రచారం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్‌లలో పఠాన్ మూవీ నేటికీ విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఐతే అమెజాన్ ప్రైమ్ షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రం మార్చి 22నుంచి ప్రీమియర్‌లో అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత OTT ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రసారం చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ప్రైమ్ వీడియోలో హిందీ, తమిళం, తెలుగులో పఠాన్‌ని చూడవచ్చు. సినిమా రిలీజ్ చేస్తున్న సందర్భంగా అమెజాన్ ట్విట్టర్ పోస్ట్ ఇలా పెట్టింది. “వాతావరణంలో అల్లకల్లోలం ఉందని భావిస్తున్నాం, ఎందుకంటే పఠాన్ మూవీ వచ్చేస్తోంది కాబట్టి! హిందీ, తమిళం, తెలుగులో మార్చి 22న ప్రైమ్‌లో పఠాన్ వచ్చేస్తున్నాడు”.

