మ్యాచ్ ఫీజులో జడేజాకు 25 శాతం కోత
రవీంద్ర జడేజా తన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఆన్-ఫీల్డ్ అంపైర్‌లకు సమాచారం ఇవ్వకుండా… చేతిపై క్రీమ్ రాసుకున్నందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), డీమెరిట్ పాయింట్‌ను కూడా ఇచ్చింది. జడేజా, మహ్మద్ సిరాజ్ అరచేతి నుండి క్రీమ్ తీసి అతని ఎడమ చేతి చూపుడు వేలుకు రుద్దినట్లు కెమెరా చూపించినప్పుడు, భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ 2 వ రోజు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై పలు వివాదాలు చోటుచేసుకోగా, పూర్తిగా వైద్యపరమైన కారణాలతోనే క్రీమ్‌ను వాడినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.

“ప్లేయర్స్, ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోసం ఐసిసి ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని రవీంద్ర జడేజా ఉల్లంఘించినట్లు తేలింది. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన అని ఐసిసి తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. జడేజా కేవలం వైద్యం కోసమే క్రీమ్ రాసినట్టు మ్యాచ్ రిఫరీ సంతృప్తి చెందాడు. క్రీమ్‌ను బంతికి వినియోగించలేదని…మిగతా ఏ షరతులను ఉల్లంఘించలేదని ఐసీసీ వెబ్ పేర్కొంది. ఐసిసి ప్రకటనను మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, టిమ్ పైన్ కొట్టిపారేశారు. క్రీమ్ ద్వారా బాల్ కండిషన్‌తోపాటు, ట్యాంపరింగ్ చేయవచ్చని ఆరోపించారు. అయితే, భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్‌కు అనేక మంది భారత మాజీ క్రీడాకారులు మద్దతిచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ సైతం మొత్తం వ్యవహారంపై రచ్చ అవసరం లేదన్నాడు. సిరాజ్ చేతికి ఉన్న క్రీమ్ ను జడేజా వేలికి రాసుకున్నాడని.. దానిని బంతికి రుద్దలేదని అన్నాడు.

