Home Page SliderInternational

హాలీవుడ్‌కు బురద వరద

అమెరికాలోని కాలిఫోర్నియా ప్రముఖులు నివాసముండే సంపన్న ప్రాంతం. అక్కడ ఎందరో హాలీవుడ్ తారలు కూడా నివసిస్తున్నారు. కాకపోతే ఇప్పుడీ నగరానికి బురద ముప్పు ఏర్పడింది. మాంటిసిటో అనే ప్రాంతంలో బురద చరియలు విరిగి పడుతున్నాయి.  దీనితో బురద నీరు నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని, నగరాన్ని విడిచి వెళ్లాలంటూ అధికారులు ఆదేశిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బురద తుఫానులో చాలా ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. విపరీతమైన మంచు తుఫాన్‌తో మొన్నటి దాకా కష్టాలు పడిన దేశ వాసులను ఇప్పుడు బురద ముంచెత్తబోతోంది. ఈ మాంటిసిటో ప్రాంతంలో అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ దంపతులు, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ప్రే, నటులు ల్యారీ డేవిడ్, కేటీ పెర్రీ, రాబ్ లోవ్, గినెత్ పాల్ట్రోతో వంటి వారు ఇక్కడే ఉన్నారు.

హాలీవుడ్ కమెడియన్ ఎల్లెన్ డిజెనెరెస్ నగరంలో పరిస్థితిని చూపిస్తూ ట్విటర్లో వీడియో కూడా పోస్టు చేశారు. నగరం వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నెలరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో దాదాపు 20 సెంటీమీటర్లు వర్షం కురుస్తుందని అంచనాలు వేస్తున్నారు.