మందుబాబులకు గుడ్‌న్యూస్…
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ నెల 31న బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు 2బి లైసెన్స్ ఉన్న బార్లలో రాత్రి ఒంటి గంట వరకు అమ్మకాలు జరపొచ్చని తెలిపింది. పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీస్ శాఖ నిబంధనలు పెట్టింది. త్రీ స్టార్, ఫైవ్ స్టార్, పబ్బులు, క్లబ్బులకు నిబంధనలు విడుదల చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని తెలిపింది. అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని కోరారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్‌కి మించకూడదని షరతు విధించారు. 31 రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేతో పాటు పలు ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా.. ర్యాష్ డ్రైవింగ్, బైక్‌లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

