NationalNews

డబ్బును మీ చేతిలోనే ఉంచుకోండి…కొత్తగా టీవీ, ఫ్రిడ్జ్ కొనద్దు…

ఆర్థికమంద్యం ముంచుకొస్తున్న తరుణంలో అమెజాన్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. చేతిలో అందుబాటులో ఉన్న డబ్బును అనవసరంగా ఖర్చు చేయొద్దన్నాడు. వచ్చే సెలవు రోజుల్లో ఎవరూ కూడా టీవీ, ఫ్రిడ్జ్ కొనద్దని సూచించారు. వినియోగదారులు తమ నగదును భద్రంగా ఉంచుకోవాలని, సెలవు కాలంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని జెఫ్ బెజోస్ సూచించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, కోటీశ్వరుడు జెఫ్ బెజోస్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ చర్చకు కారణమవుతున్నాయ్. CNNతో మాట్లాడుతూ, వ్యాపార దిగ్గజం వినియోగదారులు తమ నగదును సురక్షితంగా ఉంచుకోవాలని కోరాడు. రాబోయే నెలల్లో అనవసరమైన ఖర్చులను నివారించాలని సూచించారు. యునైటెడ్ స్టేట్స్ మాంద్యం వైపు వెళ్తోన్నందున అమెరికన్ కుటుంబాలు కొత్త కార్లు, టీవీల వంటి ఖర్చుతో కూడుకున్న వస్తువుల కొనుగోలును నివారించాలని అతను సిఫార్సు చేశాడు. ఆర్థికంగా ఎలాంటి పరిస్థితి ఎదురైన అప్పుడు తట్టుకోగలుగుతామన్నాడు జెఫ్ బోజెస్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేదన్న బోజెస్… పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నాడు.

అదే సమయంలో తన ఆస్తిలో $124 బిలియన్ల ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, పెరుగుతున్న సామాజిక, రాజకీయ విభజనల మధ్య మానవాళిని ఏకం చేయగల వ్యక్తులకు మద్దతుగా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఎంత మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో ఆయన చెప్పలేదు. తన జీవితకాలంలో తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి విరాళంగా ఇస్తారా అని అడిగినప్పుడు, అతను “అవును, నేను చేస్తాను” అని బదులిచ్చారు.
జెఫ్ బెజోస్ ప్రస్తుతం అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, గత సంవత్సరం తన మునుపటి CEO రోల్ నుంచి తప్పుకున్నారు.