NewsTelangana

టెలికాంనగర్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టెలికాం నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. టెలికాం నగర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందారు. వీరు సరదాగా ఈత కొట్టేందుకు నానక్‌ రాం గూడ గోల్ఫ్ కోర్స్‌ పక్కనే ఉన్న చెరువులో దిగారు. వారు మరింత లోతుకు వెళ్లడంతో ఈత రాక మునిగిపోయారు. ఇతర విద్యార్థులు ఈ విషయం గమనించి అక్కడున్నవారికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ ముగ్గురు విద్యార్థులు పూర్తిగా మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో టెలికాం నగర్‌లో విషాదం నెలకొంది.