InternationalNews

అడిలైడ్‌ చేరుకున్న భారత జట్టు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దూకుడుతో ఆడుతూ.. మంచి జోష్‌లో కనిపిస్తుంది. గ్రూప్‌-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈనెల 10న అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌ ఓవల్‌కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. టీమిండియా సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలబడనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు మొదలు పెట్టింది. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో భారత జట్టు గెలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయింది. 2007లో టీ20 ప్రపంచకప్‌ గెలుచుకుంది. మళ్లీ ఇప్పటి వరకు టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోలేదు. ఈ సారి భారత జట్టు మంచి జోరుమీద ఉండడంతో ప్రపంచకప్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈసారైనా భారత జట్టు కప్‌తోనే తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు.