ఝార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రేపు రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో పంకజ్ మిశ్రాకు సంబంధం ఉన్నట్లు ఈడీ స్పష్టం చేసింది. జులై 8న మిశ్రాతో పాటు ఆయన సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది.

