జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రచారం
దర్మకుడు రాజమౌళి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతూ అందరిని అలరిస్తున్నాయి. ఈగ , బాహుబలి సినిమాలు ఇక్కడి ప్రజల నుండి పొందిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక పోతే ఈ సినిమాలు పలు దేశాల్లో విడుదలై అక్కడి ప్రేక్షకుల ఆదరణను కూడా పొందడం విశేషమనే చెప్పొచ్చు. జపాన్‌లో అనువాదమైన బహుబలి విశేష ఆదరణ పొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ కూడా ఓటీటీ వేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చేరువవుతూ అందరిని అలరిస్తోంది. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలో ఇటీవల పలు చోట్లా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వాటికి రాజమౌళి కూడా హాజరై వారి స్పందనను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ క్రమంలోనే జపాన్‌లో రామ్ , భీమ్ల సందడి షూరు కాబోతుంది. ఈ నెల 21ల జపాన్‌లో ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జపాన్‌లో కూడా దీని ప్రచారం చేసేందుకు రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్‌చరణ్ జపాన్‌కి ప్రయాణమయ్యారు. అక్కడ ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే.