టీచర్లను అవమానిస్తారా..
ఉపాధ్యాయ దినోత్సవం రోజున కూడా టీచర్లను అవమానించడంపై మంత్రి బొత్స మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలపై సోమవారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఇప్పుడు టీచర్ల విషయంలోనూ రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులను అవమానించేలా మాట్లాడటం భావ్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీచర్లకు ఏం చేశారన్నారో చెప్పాలన్నారు. జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను అమలు లోనికి తెచ్చారన్నారు. అమ్మఒడితో అందరికీ చదువు అందిస్తున్నామని, ఫీజు రియింబర్స్‌మెంట్ విద్యార్థులకు అండగా ఉన్నామన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్యారా విద్యారంగంలో ఎన్నో మార్పులు చేశామని, అవన్నీ చూసిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతలు ఇలా మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు.