బీఆర్ఎస్ అధికార వ్యామోహం: పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, బీఆర్ఎస్ నేతలకు మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని అర్థమైందని విమర్శించారు.
కాళేశ్వరం పేరుతోనైనా అధికారంలోకి రావాలనే ఆరాటంతోనే ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించాలని, మూడు నెలలు ఇరిగేషన్ శాఖ తమకు ఇవ్వాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది అధికార వ్యామోహానికే నిదర్శనమన్నారు.
హరీష్‌రావును ఉద్దేశించి, అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా కమిషన్లు పెండింగ్‌లో మిగిలిపోయాయా? వాటి కోసమే మూడు నెలలు ఇరిగేషన్ శాఖ కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
బావ– బామ్మర్దుల ఆధిపత్య పోరు ఇప్పుడు కాళేశ్వరం వరకు చేరిందని, పదవుల కోసం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

