BusinessHome Page SliderInternationalNews Alert

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్

ఇంటర్నెట్ డెస్క్ : గూగుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. భారత్ లోని గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్స్ ను ప్రకటించింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో జెమిని ఏఐ ఫీచర్లు, సేఫ్టీ నోటిఫికేషన్లు, మెట్రో టికెట్ బుకింగ్, ప్రమాద ప్రాంతాల వివరాలు వంటి అధునాతన సేవలున్నాయి.
. గూగుల్ మ్యాప్స్ లో వాయిస్ ఇంటరాక్షన్ సదుపాయం జెమినీ ఏఐ సాయంతో పనిచేస్తుంది. ఆ దారిలో బడ్జెట్ రెస్టారెంట్స్, పార్కింగ్ సదుపాయం వంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు.
. గూగుల్ మ్యాప్స్ నుండే మెట్రో ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు నేరుగా గూగుల్ వాలెట్ లో సేవ్ అవుతాయి.
. గూగుల్ జెమిని ఆధారంగా వెళ్లే దారిలో చూడవలసిన ప్రదేశాల సమాచారం తెలుసుకోవచ్చు.
. ప్రోయాక్టివ్ ట్రాఫిక్ అలర్ట్స్ ద్వారా రోడ్డు బంద్, ట్రాఫిక్ జామ్ లపై హెచ్చరికలు అందుతాయి. త్వరలోనే భారత్ నగరాలలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
. అలాగే యాక్సిడెంట్ ప్రమాదం ఉన్న ఏరియాలపై కూడా ముందస్తు అలర్ట్ ఇస్తుంది.
. ఒక దారిలో వెళ్తునప్పుడు అక్కడి గరిష్ట వేగపరిమితిని సూచిస్తుంది. ఇది ఆథరిటేటివ్ స్పీడ్ లిమిట్స్ ఫీచర్ ద్వారా లభిస్తుంది.
. టూ- వీలర్ నేవిగేషన్ అవతార్ ద్వారా తమ బైక్ ఐకాన్, రంగును ఎంచుకోవచ్చు.
. తొమ్మిది భాషల్లో వాయిస్ గైడెన్స్ ద్వారా స్క్రీన్ వైపు చూడకుండానే రూట్ తెలుసుకుని డ్రైవింగ్ చేయవచ్చు.