Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పంచాయతీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు చేరేలా చూడాలి

రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

“పాలనా సంస్కరణల ఫలితాలు నేరుగా ప్రజలకు చేరేలా చూడాలి. నవంబర్‌ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను ప్రారంభించాలి,” అని పవన్‌ స్పష్టం చేశారు.

పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాలనా సంస్కరణల అమలు ప్రగతిని నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు.

అదేవిధంగా, ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమం కింద గ్రామ స్థాయిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పూర్తి ప్రణాళికను రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.