Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelangana

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఇకలేరు

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి గారు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

కొండా లక్ష్మారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి, ఆ పార్టీ పట్ల జీవితాంతం అంకితభావంతో కొనసాగారు. రెండు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన ప్రజల మన్ననలు పొందారు.

రాజకీయాలతో పాటు జర్నలిజంపై కూడా ఆయనకు అపారమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి ఫలితంగా “న్యూస్ సర్వీస్ సిండికేట్” అనే మీడియా సంస్థను స్థాపించి జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేశారు.

ఆయన అంతిమ యాత్ర కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు.