గర్భస్థ శిశువుకి విటమిన్ ‘డి’
కాబోయే తల్లులు తమ గర్భంలోని శిశువు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు అతి జాగ్రత్తతో మరీ ఎండకన్నెరగకుండా ఉండడం అసలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే గర్భస్థ శిశువుకి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ‘డి’ ఎంతో అవసరం.
. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో కాస్త ఎండకి నడిస్తేనే విటమిన్ డి కడుపులోని బిడ్డకి నేరుగా లభిస్తుంది.
. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడడానికి ఈ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
. విటమిన్ ‘డి’ లోపించిన పిల్లలు నెలలు నిండకుండా పుట్టడం, పొడవు తక్కువగా ఉండడం వంటి సమస్యలతో పుట్టే ప్రమాదం ఉంది.
. గర్భిణీలు తొమ్మిదోనెలలో రోజూ 10 సార్లయినా బిడ్డ కదలికలను చెక్ చేసుకోవాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.
. రోజూ 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి. అలాగే హైబీపీ రాకుండా చూసుకోవాలి. దీనివల్ల శిశువుకు రక్త సరఫరా అందకపోయే ప్రమాదముంది.
. హై ప్రొటీన్ ఉండే సోయా, పన్నీర్ వంటి ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు, పండ్లు ఎక్కువగా తినాలి.
. బిడ్డ ఎదుగుదలకు ఉమ్మనీరు ఎంతో కీలకం. ఇది తగ్గకుండా రోజుకు మూడు లీటర్ల నీరు తాగాలి.
. యూరినల్ ఇన్ ఫెక్షన్లు రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం అవగాహన కోసమే ఇవ్వబడ్డాయి. గర్భిణీ మహిళలు వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాలి.