Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertTrending Todayviral

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

  • చేనేత కార్మికులకు జీఎస్టీ మినహాయింపు
  • మగ్గాలకు ఉచిత విద్యుత్
  • రూ. 5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. చేనేత వస్త్రాలపై మొత్తం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని, పూర్తి మినహాయింపు లభిస్తుందని తెలిపారు. చేనేత రంగానికి మద్దతుగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. కార్మికుల కోసం రూ. 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకూ, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగమే అత్యంత కీలకమైన రంగంగా ఉందని, దీనిపై ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో సీఎం ప్రస్తావించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు దక్కాయని, ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తి విభాగంలోనూ మొదటి సారి అవార్డు దక్కిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అధికారులను సీఎం అభినందించారు. నేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.