Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

పిరికి పందలకు భయపడొద్దని వారు చెప్పారు

ఎన్డీయే సర్కార్ పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష ‘నేత రాహుల్ గాంధీ’ సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నానని చెప్పుకొచ్చారు. “పిరికి పందలను చూసి భయపడొద్దని” నా కుటుంబం చెప్పిందిని కూడా అన్నారు. రాజ్యాంగం మా రక్తం లాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరంటూ ఎన్డీయే సర్కార్ పై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం. రఫేల్ డీల్లో పీఎంవోతో పాటు ఎస్ఎస్ఏ డీల్ చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మాకు డాక్యుమెంట్ దొరికింది” అని రాహుల్ తెలిపారు.