ఏపీలో ఇకపై వారికి కూడా పెన్షన్
ఏపీలో వితంతువులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన భార్యకు.. ఇకపై ఈ నెల నుంచి అదే పెన్షన్ కొనసాగుతుంది. దీనిపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ పేరుతో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా లక్షా తొమ్మిది వేల మంది వితంతు మహిళలకు ఆగస్టు నెల నుంచే పెన్షన్ మంజూరు కానుంది. సామాజిక భద్రత లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచే కొత్తగా లక్షా 9 వేల మంది వితంతు మహిళలు.. ప్రభుత్వం నుంచి నెలనెలా పింఛను పొందనున్నారు. ఇప్పటిదాకా ఈ పెన్షన్ మరణంతో ముగిసిపోయేది. ఇకపై అర్హత ఉన్న జీవిత భాగస్వామికి నేరుగా కొనసాగుతుంది. అర్హులుగా గుర్తింపు అనంతరం ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది.