ఫలించని జడేజా ఒంటరి పోరాటం..2-1తో ఇంగ్లండ్ ముందంజ
ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు. జడేజా ఒంటరి పోరాటం చేసినా, బ్యాటర్లు హ్యాండివ్వడంతో ఫలితం లేకపోయింది. చివరకు భారత జట్టు పోరాడి ఓడిపోయింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 తో ముందంజలో ఉంది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (61 పరుగులతో నాటౌట్) ఒక్కడే ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరారు. సిరాజ్ 4, జస్‌ప్రీత్ బుమ్రా 54 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి 13, వాషింగ్టన్ సుందర్ 0, కేఎల్ రాహుల్ 39, రిషబ్ పంత్ 9 పరుగులతో పెవిలియన్‌కు చేరారు. అంతకుముందు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసి భారత్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో, రెండు జట్లు 387 స్కోరుతో సమానంగా నిలిచాయి.