మనిషి గుండె ఒక యంత్రమా..?లేక విచిత్రమా..?
ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు శరీరంలో కొన్ని అవయవాల్లో గుండె కొన్ని పరిస్థితుల్లో స్వతహాగా పనిచేసుకోగలదని పరిశోధనల్లో తేల్చారు. అదే విషయాన్ని కొంతమంది కార్డియాలజిస్టులు ఏకీభవిస్తున్నారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెదడుతో సంబంధం లేకుండా మార్పులు చేసుకుంటూ జీవించగలదని తన భాగాలకు సంబందించిన పనితీరును తానే కొన్ని సందర్భాల్లో నిర్ణయించుకోగలదని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మెదడే ప్రాధమికంగా అన్ని అవయవాలను నియంత్రించే శక్తి, మరియు పనితీరును నిర్ణయిస్తుందని అనుకుంటాం. కానీ ఈ పరిశోధనలో ఒక కొత్త ఆలోచనా విధానానికి పునాది వేసినట్లయినది. ఎందుకంటే గుండె జీర్ణకోశ వ్యవస్థలలో మార్పులు వచ్చినప్పుడు అంటే గుండెలో నొప్పి కానీ, ఆయాసం కానీ, ప్లేక్ (కొవ్వు రక్త నాళాలలో పేరుకొనుట) పేరుకున్నప్పుడు, అలాగే జ్వరం వచ్చినప్పుడు అజీర్తి వల్ల కానీ, వాంతుల వల్ల కానీ, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు జీర్ణకోశం కూడా స్వతహాగా ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తుంది. కానీ మన దేహ అస్వస్థత కారణంగా మనం మెదడులో వచ్చిన ఆలోచన ప్రకారం భయంతో తొందరగా ఉపశమనం పొందడానికి టాబ్లెట్స్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లడం చేస్తాము. కారణాలు ఏమైనప్పటికి మనిషికి కావాల్సింది సత్వర ఉపశమనం. మనం కనుక అటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన శరీరంలో తగిన మార్పులను తొందరగా గుర్తించవచ్చును. దీనివలన భవిష్యత్తులో మనం ఒక రకంగా వైద్యానికి, వైద్యుడికి దూరంగా ఉండవచ్చును.

