శంషాబాద్‌లో రూ.3 కోట్ల డ్రగ్స్…
శంషాబాద్ రాయికల్ టోల్‌గేట్ వద్ద భారీగా హెరాయిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి మీడియా సమావేశంలో మాట్లాడారు. షాద్‌నగర్‌లోని సంజుభాయ్ మార్వాడీ డాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం వచ్చిందని, దీనితో నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో దాబాలో పనిచేసే వంట మనిషి వికాస్ సాహు రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకి విక్రయిస్తున్నారని తెలిసిందని, దీనితో రైడ్స్ చేశామన్నారు. వికాస్ సాహు వద్ద నుండి రూ.3 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశామని, దీనితో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ కూడా అతని వద్ద లభించాయన్నారు.

