ఖలేజా ఫీవర్..మహేశ్ అభిమాని రచ్చ
ఖలేజా రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు రచ్చ చేస్తేస్తున్నారు. నేడు ఖలేజా రీరిలీజ్ హడావుడి ఎక్కువగా ఉంది. విజయవాడలో ఒక అభిమాని థియేటర్‌లోకి పాముని తీసుకెళ్లాడు. మహేశ్ బాబు ఫైట్ సమయంలో స్క్రీన్ వద్ద అభిమాని కూడా పాముతో హల్‌చల్ చేశాడు. అలాగే హైదరాబాద్‌లో కూడా కొందరు అభిమానులు సీన్ రీక్రియేట్ చేస్తున్నారు. ఒకరు ఆసుపత్రి డ్రెస్‌తో సినిమాకి వెళ్లారట. కుండీలో మొక్కని కూడా తీసుకెళ్లారట. ఖలేజా రీరిలీజ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం మహేశ్ రాజమౌళి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.