పాక్ గూఢచర్యంలో అరెస్టయిన రాష్ట్ర మంత్రి పీఏ
పాకిస్తాన్ గూఢచర్యం నేపథ్యంలో పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. భారత్‌లో మూలమూల ప్రదేశాలలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఆనవాళ్లు చూసి, భద్రతా అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక మంత్రి పీఏగా గతంలో పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేశారు సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం అతనిది పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామంలోని మంగళియార్. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలున్నాయన్న సకూర్ ఖాన్‌పై అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలియడంతో అతనని విచారించడానికే అరెస్టు చేశామని అధికారులు చెప్తున్నారు. అతని మొబైల్‌లో పాకిస్తాన్ నంబర్లు కూడా ఉన్నాయి. వాటిపై అతడు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదన్నారు. అలాగే కొన్ని ఫైల్స్ డిలీట్ చేసినట్లు గుర్తించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలోని సరిహద్దు జిల్లాలలో పాక్ ఉగ్ర నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే పనిలో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో సకూర్ ఖాన్ వ్యవహారం బయటపడింది.

